వర్మ..అర్జున్ రెడ్డి..ఓ సెల్ఫీ

అర్జున్ రెడ్డి వివాదాల్లో చిక్కుకున్నప్పటి నుంచి ఆ చిత్రంతో పాటు హీరో విజయ్ దేవరకొండకు కొండంత అండగా నిలబడింది మన రామ్ గోపాల్ వర్మ. ఈ విషయాన్ని ఎవరైనా ఒప్పుకుంటారు. ఫేస్‍బుక్ ట్విట్టర్ అనే తేడాలు లేకుండా ఎవరైనా అర్జున్ రెడ్డి సినిమాను విమర్శిస్తే విజయ్ కంటే ముందే వర్మ రియాక్ట్ అయ్యాడు. విజయ్ కూడా చాలా సందర్భాల్లో వర్మకు కృతజ్ఞతలు చెప్పాడు కూడా. ఇద్దరి మనోభావాలైతే కలిసాయి అనుకున్నారు కానీ వాళ్ళు కూడా కలిస్తే భాగుండనేది వాళ్ళ అభిమానుల ఆశ. దాన్ని ఎట్టకేలకు ఇద్దరూ నిజం చేశారు. ఒక రెస్టారెంట్‍లో కలిసి సెల్ఫీ దిగారు. ఆ ఫొటోని వర్మ తన ఫేస్‍బుక్ పేజీలో పెట్టాడు. అంతేనా తాను కండలు చూపిస్తున్నందుకు విజయ్ నవ్వుతున్నాడని కామెంట్ కూడా చేశాడు.

YOU MAY LIKE