"అర్జున్ రెడ్డి"కి వర్మ పబ్లిసిటి!

సాధారణంగా సినిమాల చుట్టూ వివాదాలు తిరుగుతాయి కానీ అర్జున్ రెడ్డి సినిమా విషయంలో కొంచెం భిన్నం. వివాదాలే ఆ చిత్రం చుట్టూ తిరుగుతున్నాయి. అసలే లీక్ వీడియోలు, టీజర్‍, ట్రైలర్‍లతో కాంట్రవర్శీలకు కేరాఫ్ అడ్రెస్‍గా మారిపోయినా ఈ సినిమా మొన్న తెలంగాణ కాంగెస్ నేత వీహెచ్ పోస్టర్ చింపడం తరువాత ప్రీ రిలీజ్ ఈవెంట్‍లో హీరో విజయ్ దేవరకొండ సంచలన స్పీచ్‍తో మరింత వివాదాల్లోకి చిక్కుకుంది. తాజాగా అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్లపై మహిళా సంఘాలు కేసు పెట్టినట్టు సమాచారం.

ఇన్నిటి మధ్య ఈ సినిమాకు హీరో విజయ్‍కు అండగా కాంట్రవర్శీకి కేరాఫ్ అడ్రెస్‍ మన రామ్‍గోపాల్ వర్మ నిలబడ్డాడు. వివాదాలకు వెన్ను నిలిచే వర్మ విజయ్ దేవరకొండపై ప్రశంసలు కురిపించాడు. అర్జున్ రెడ్డి పోస్టర్ చించిన మాజీ మంత్రి వి. హనుమంతరావుపై తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. పోస్టర్ చింపినందుకు విజయ్ వీహెచ్ షర్ట్ చింపి‍తే సరిపోతుందేమోనంటూనే అలా చేస్తే ఆయన్ని చూసి పిల్లలు భయపడతారేమోనని చురకలంటించాడు. అసలు వీహెచ్ ఆ పోస్టర్ ఎందుకు చించాడో తనకు అర్ధం కాలేదని బహుశా ఆయన ఆ పోస్టర్ చూసి తాను ఎప్పుడూ ముద్దుపెట్టుకోలేదని కుల్లుకున్నారేమోనని వ్యాఖ్యానించాడు. అర్జున్ రెడ్డి మనవళ్ళకీ మనవరాళ్ళకే కాని కచ్చితంగా తాతయ్యలకి కాదని కావాలంటే వీహెచ్ తన మనవళ్ళని అడగమని పోస్ట్ చేశారు. ఈ పిల్ల చేస్టల‌ వల్ల యువత వచ్చే ఎన్నికల్లో ఓటు వెయ్యకపోతే అసలే తాతయ్యగా మారిన మీ పార్టీ డబుల్ తాతయ్య అవుతుందని సెటైర్లు వేశాడు.

YOU MAY LIKE