జియో 'స్మార్ట్ ఫోన్' చేదువార్త ... !!

జియో స్మార్ట్ ఫోన్ బుక్ చేసుకున్న వినియోగదారులకు చేదువార్త..ఇప్పటికే ఈ స్మార్ ఫోన్ బుక్ చేసుకున్న వినియోగదారులకు ఫోన్ డెలివరీ ఆలస్యం కానుంది.  సెప్టెంబర్ మొదటి వారం నుంచి అందిస్తామని సంస్థ గతంలో ప్రకటించింది. అయితే, ఈ ఫోన్ల డెలివరీకి మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. జియో ఫోన్లు తమ స్టోర్స్ కు రావడానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని రిలయన్స్ డిజిటల్ స్టోర్ ప్రతినిధులు తెలిపారు.  ఇప్పటికే 3 నుంచి 4 మిలియన్ యూనిట్ల వరకు ఈ స్మార్ట్ ఫోన్లను బుక్ చేసుకోవడంతో ఫోన్ ప్రీ బుకింగ్స్ ను సంస్థ  నిలిపివేసింది.

YOU MAY LIKE