మేమిద్దరం స్నేహితులం మాత్రమే..

ప్రముఖ నటుడు రానా, తాను ప్రేమించుకుంటున్నామంటూ వస్తున్న వదంతుల్లో ఎటువంటి వాస్తవం లేదని హీరోయిన్ కాజల్ స్పష్టం చేసింది. రానా - కాజల్ జంటగా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం రెండు రోజుల క్రితం విడుదలైంది. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియాతో కాజల్ మాట్లాడుతూ, మేమిద్దరం ప్రేమించుకుంటున్నామనే వదంతుల్లో ఏ మాత్రం నిజం లేదని, తామిద్దరం చాలాకాలంగా స్నేహితులమని చెప్పింది. రానా కష్టపడే వ్యక్తి అని, ‘బాహుబలి’ సినిమాతో రానాకు రావాల్సిన గుర్తింపు వచ్చిందని తెలిపింది.