నో పాలిటిక్స్..

రాజకీయాలు తన ఒంటికి పడవని హీరో రానా అన్నారు. నేనే రాజు నేనే మంత్రి మూవీ ప్రమోషన్ లో భాగంగా విజయవాడలో చిత్రయూనిట్ సందడి చేసింది. హీరో రానా, కాజల్, కేథరిన్, డైరెక్టర్ తేజ ట్రెండ్ సెట్ మాల్ లోని క్యాపిటల్ సినిమాస్ లో అభిమానులను కలిశారు. సినిమా పూర్తిగా రాజకీయాలపై ఉండదన్న రానా.. జోగీంద్ర, రాధ ప్రణకావ్యంలో రాజకీయాలు ఓ భాగంగా వస్తాయన్నారు. టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరించిన రానా.. తన పని తాను చేసుకుపోతానన్నారు. బాబాయ్ వెంకటేష్ తో నటించాలంటే తనకు భయమని.. మంచి కథ వస్తే కలిసి నటించేందుకు సిద్ధమని చెప్పారు.