కలిసికట్టుగా ర్యాలీ ఫర్ రివర్స్ !!

ప్రకృతితో అనుసంధానమై జీవనం గడపాలని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసదేవ్ పిలుపునిచ్చారు. తాను ఎప్పటి నుంచో ప్రకృతితో అనుసంధానించి జీవితాన్ని గడుపుతున్నానని చెప్పిన ఆయన నదులు అంతరించిపోతే విపత్తులు సంభవిస్తాయన్నారు. పాతికేళ్లుగా నదుల సంరక్షణ కోసం పరితపిస్తున్నట్లు తెలిపారు. ర్యాలీ ఫర్ రివర్స్ లో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ర్యాలీ ఫర్ రివర్స కార్యక్రమానికి ప్రముఖ సినీనటులు, క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. ప్రజలంతా నదుల సంరక్షణ కృషిచేయాలని పిలుపునిస్తున్నారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి వినతిప్రతాన్ని సమర్పించడంతో ఈకార్యక్రమం పూర్తి కానుంది.
దేశంలోని న‌దుల‌ను కాపాడుకునేందుకు విస్తృత ప్ర‌చారం చేయ‌డానికి తలపెట్టిన ర్యాలీ ఫర్ రివర్స్ 16 రాష్ట్రాల్లో పర్యటించి..21 నగరాల్లో పెద్దఎత్తున్న సభలు నిర్వహించనుంది. పలువురు ప్రముఖులను, సామాన్య ప్రజానీకాన్ని ఈకార్యక్రమంలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్ ర్యాలీ ఫర్ రివర్స్ కు శ్రీకారం చుట్టారు.

YOU MAY LIKE