ర్యాలీ ఫర్‌ రివర్స్

నదుల సంరక్షణ కోసం ఇషా ఫౌండేషన్‌ తలపెట్టిన ర్యాలీ ఫర్‌ రివర్స్  విజయవాడ చేరింది. సిద్ధార్థ కళాశాలలో ఇవాళ  నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ గత నెలలో కోయంబత్తూరులో ఈ ర్యాలీని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 21 నగరాల్లో ఆయన పర్యటించనున్నారు. వచ్చే నెల 3 వతేదీ వరకు ఈ ర్యాలీ కొనసాగనుందని జగ్గీ వాసుదేవ్ తెలిపారు.  

YOU MAY LIKE