2.0 కి సిద్ధం

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌తో కలిసి మరోసారి మ్యాజిక్‌ చేసేందుకు సిద్ధమైపోయాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం 2.0. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా మేకింగ్ వీడియోను శంకర్ రిలీజ్ చేశాడు. ఈ వీడియో చూస్తుంటే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆలోచన రాక తప్పదు. విజువల్ ఎఫెక్ట్స్ ఏ స్థాయిలో ఉంటాయో వీడియోలో చిన్నపాటి క్లూస్ ఇచ్చింది చిత్రబృందం. ఈ చిత్రంలో అమీజాక్సన్‌ కథానాయికగా నటిస్తుండగా బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌కుమార్‌ ప్రతినాయక పాత్రను పోషిస్తున్నారు. 2018 రిపబ్లిక్‌ డే సందర్భంగా 2.0 రిలీజ్ కానుంది.

YOU MAY LIKE