జక్కన్నకు ఏఎన్నార్‌ జాతీయ పురస్కారం

ప్రతిష్టాత్మకమైన ఏఎన్నార్‌ జాతీయ పురస్కారాన్ని బాహుబలి సృష్టికర్త, స్టార్ డైరక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి అందుకోనున్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ విషయాన్ని అవార్డు కమిటీ చైర్మన్ టీ. సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, అక్కినేని అమల పాల్గొన్నారు. ఈనెల 17న హైదరాబాద్‍లోని శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రాజమౌళి ఈ పురస్కారాన్ని స్వీకరించనున్నారు.

ఇప్పటి వరకు దేవానంద్, షబానా ఆజ్మీ, అంజలీదేవి, వైజయంతిమాల, లతామంగేష్కర్‌, బాల చందర్‌, హేమమాలిని, శ్యామ్‌బెనగల్‌, అమితాబ్‌ బచ్చన్‌లు అక్కినేని పురస్కారాన్ని అందుకున్నారు. ఇదే విషయాన్ని నాగార్జున తన ట్విట్టర్‍లో కూడా పేర్కొన్నారు.

 

YOU MAY LIKE