సేఫ్ జర్నీ..

రైల్వే వ్యవస్థలో మార్పులకు కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. ప్రమాదాల తీవ్రతను తగ్గించి, అధిక వేగంతో ప్రయాణించే LHB బోగీలను మరింత పెంచేందుకు కేంద్రం నిర్ణయించింది. LHB బోగీల తయారీ కర్మాగారాన్ని కర్ణాటకలోని యాద్గిరిలో ఈ నెల 18న ప్రారంభించనున్నారు. ఈ ఫ్యాక్టరీ నుంచి ఏటా 6 వందల బోగీ ఫ్రేములు తయారవుతాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పెరంబూరు, కపుర్తలా, బరేలిలోని కోచ్ ఫ్యాక్టరీల్లో మాత్రమే LHB బోగీలు తయారవుతున్నాయి. యాద్గిరి ఫ్యాక్టరీ ద్వారా సుమారు 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు