మల్టీ టాలెంట్ తో ... !!

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా మల్టీ టాలెంట్ తో దూసుకుపోతోంది. ఓవైపు బాలీవుడ్ లో సినిమాలతో పాటు హాలీవుడ్ లోనూ  మెరుస్తోంది. హీరోయిన్ గా కెరీర్ స్పీడప్ చేస్తూనే.. ప్రొడ్యూసర్ గా సత్తా చాటుతోంది. ఇటీవల ఆమె నిర్మించిన వెంటిలేటర్ మూవీకి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఇప్పుడీ బ్యూటీ సింగర్ అవతారం ఎత్తింది. యంగ్ అండ్ ఫ్రీ అనే సాంగ్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.  ఒక ప్రయోగం రియాల్టీగా మారిందంటూ పాట రూపొందించిన తీరును అభిమానులతో చెప్పింది. ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండింగ్ గా మారింది.