ప్రభాస్ తో మరో మూవీ..

రాజమౌళి తన తదుపరి సినిమాకి పూర్తిస్థాయి కథను సిద్ధం చేసుకునే పనిలో వున్నాడు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఆయన ప్రభాస్ తో మరో సినిమా చేయనున్నాడట. ఆల్రెడీ స్టోరీ లైన్ కూడా రెడీగానే ఉందనీ .. కమర్షియల్ పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. ఎవరి ప్రాజెక్టులు వారు పూర్తి చేయగానే .. ఇద్దరూ కలిసి మరో సంచలనానికి తెరతీయనున్నారనే వార్త బలంగానే వినిపిస్తోంది.