రాజ‌కీయాల్లో త‌లైవా ప‌నికిరారు..

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడుకు ముఖ్యమంత్రిగా రజనీకాంత్‌ సరిపోరర‌ని.. ఆయనకు రాజకీయాల్లో భవిష్యత్తు లేదని తేల్చేశారు. ఇంత‌టితో ఆగ‌కుండా తమిళనాడులో ఎంతో మంది నాయ‌కులు చదువుకున్న వాళ్లు ఉన్నార‌ని..  చదువుకోని త‌లైవా సీఎంగా ఏమాత్రం సరిపోరన్న స్వామి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. స్వామి వ్యాఖ్య‌లపై సూప‌ర్ స్టార్ అభిమానులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు.  

YOU MAY LIKE