ఎర్ర చందనం పై ఉక్కు పాదం

ఎర్ర చందనం స్మగ్లర్ల ఆటకట్టించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నాయి. అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కు పాదం మోపడంతో బడా స్మగ్లర్లు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. లంచాలతో కింది స్ధాయి సిబ్బందిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు అడ్డంగా బుక్కవుతున్నారు. కడప జిల్లాలో తాజాగా ఆరుగురు   ఎర్రచందన స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో మోస్ట్ వాంటెడ్  అంతర్జాతీయ ఎర్ర చందన స్మగ్లర్ మహమ్మద్ ఇస్మాయిల్ కూడా ఉన్నారు. మహమ్మద్ ఇస్మాయిల్ కు ఎపీ తో పాటు తమిళనాడు ,కర్నాటకలోని పలువురు బడా స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరితో పాటు 97 ఎర్రచందన దుంగలు , ఓ లారీ, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

YOU MAY LIKE