కెసిఆర్ దేవుడు

సీఎం కెసిఆర్ కు వ్యవసాయ నాయకత్వ అవార్డు వచ్చిన సందర్భంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మీడియా తో మాట్లాడారు.

సీఎం కెసిఆర్ రైతుల పాలిట దేవుడు. కెసిఆర్ వ్యవసాయ రంగం లో తీసుకువస్తున్న సమూలమార్పులకు వ్యవసాయ నాయకత్వ అవార్డు రావడం అభినందనీయం. సమైక్య రాష్ట్రం లో ఏ సీఎం కు దక్కని గౌరవం 36 నెలల పాలన లో సీఎం కెసిఆర్ కు దక్కడం తెలంగాణ ప్రజల అదృష్టం. ఈ అవార్డు వూరికే రాలేదు 50 మంది తో ఏర్పాటైన కమిటీ ఈ అవార్డు ప్రకటించింది. కెసిఆర్ మంత్రి వర్గం లో వ్యవసాయ మంత్రిగా ఉన్నందుకు గర్విస్తున్నా. కెసిఆర్ కు ఎలా అభినందనలు తెలపాలో మాటలు రావడం లేదు. కెసిఆర్ ప్రతి క్షణం రైతుల సంక్షేమం గురించే తపిస్తారు. కెసిఆర్ మూడేళ్లు రైతాంగం మేలు కోసం పడ్డ తపనకు ఈ అవార్డుతో గుర్తింపు వచ్చింది. సమైక్య రాష్ట్రం లో రైతుల కరెంటు కష్టాలు చూసిన సీఎం కెసిఆర్ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ లోనే వాటిని పరిష్కరించారు. ప్రాజెక్టులు శరవేగంతో పూర్తవుతున్నాయి ప్రాజెక్టులతో కరువు తెలంగాణా జోలికి రాదు. రైతుల కు ప్రభుత్వమే పెట్టుబడి సమకూర్చాలన్న ఆలోచనను దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. వ్యవసాయ రంగం లో సీఎం కెసిఆర్ వేస్తున్న విప్లవత్మకమైన అడుగులే ఆయనకు ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడానికి కారణమయ్యాయి. సీఎం కెసిఆర్ రెండు రోజుల కోసారైనా నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడల్లా రైతుల కు విత్తనాలు ,ఎరువులు సరిగా అందుతున్నాయా లేదా అని ఆరా తీస్తారు. కెసిఆర్ నిరంతర పర్యవేక్షణతో రైతుల కు సమైక్య రాష్ట్రంలో పడ్డ కష్టాలు ఇపుడు లేవు. కాంగ్రెస్ వాళ్ళు ఎంత గా అడ్డుకున్నా ప్రాజెక్టులు ఆగవు. రైతుల రుణ మాఫీ కోసం ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన సీఎం దేశంలో కెసిఆర్ ఒక్కరే. గ్రీన్ హౌస్ ,పాలీ హౌజ్ లకు ఇంత పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. కొందరు సబ్సిడీ తగ్గిద్దాం అని ప్రతిపాదించినా సీఎం కెసిఆర్ దానికి ఒప్పుకోలేదు. కాంగ్రెస్ పాలిత పంజాబ్లో రుణ మాఫీ కి తెలంగాణే ఆదర్శంగా నిలిచింది. బీజేపీ పాలిత మహారాష్ట్రలో కేవలం రైతుల సహకార బ్యాంకుల రుణాలే మాఫీ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎన్ని విమర్శలు చేసినా కెసిఆర్ అడుగులు ముందుకే పడతాయి. మాది ఏనుగులాంటి ప్రయాణం. రాబోయే రోజుల్లో యావత్ దేశానికి వ్యవసాయ రంగం లో తెలంగాణ యే ఆదర్శం గా నిలవడం ఖాయం. కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టుల పై కోర్టుల కెళ్ళడం ఇక నైనా మానాలి ప్రజలు కాంగ్రెస్ నేతలను చీదరించుకుంటున్నారు. కెసిఆర్ కు వ్యవసాయ నాయకత్వ అవార్డు రావడం విపక్షాల విమర్శలు పస లేనివని నిరూపిస్తోంది. కౌలు రైతులు సాగు పై అధికారిక పత్రాలు చూపెడితే పెట్టుబడి ఇచ్చే విషయం పరిశీలిస్తాం.

 

YOU MAY LIKE