2019 ఎన్నికల్లో సీట్లు ఆశించవద్దు ... !

పార్లమెంట్ సమావేశాలకు హాజరు రాకపోతే 2019 ఎన్నికల్లో సీట్లు ఆశించవద్దని పార్టీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఇప్పటి వరకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని... ఇకపై ఈ విధానం సాగదన్నారు. రాజ్యసభలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అందర్నీ గమనిస్తారన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒక్కసారి చర్యలు తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గమన్నారు. బీసీ సవరణ బిల్లుపై కూడా ఓటు వేసేందుకు ఎంపీలు హాజరు కాలేదన్నారు. ఇప్పటి నుంచి కఠిన నిబంధనలు అమలు జరుగుతాయని హెచ్చరించారు

YOU MAY LIKE