అంగరంగ వైభవంగా..

రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్ లోని M కన్వెన్షన్ లో  ఇవాళ శ్రీరామ్  నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది.. అనంతపురం జిల్లా శింగనమలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె ఆలం జ్ఞానని వివాహం చేసుకోనున్నారు. అక్టోబరు 1న వీరి వివాహం జరగనుంది. నిశ్చితార్థ వేడుకకు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు  హాజరయ్యారు.