ఇస్లామాబాద్ కు చైనా ఉప ప్రధాని..

పాకిస్థాన్ స్వాతంత్ర దినోత్సవాలకు చైనా ఉప ప్రధాని వాంగ్ యాంగ్ ముఖ్య అతిధిగా హజరుకానున్నారు. ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇస్లామాబాద్ లో జరగనున్న 70వ స్వాతంత్ర వేడుకల్లో ప్రధాని షాబిద్ అబ్బాసీతో కలిసి వాంగ్ పాల్గొంటారని అధికారులు తెలిపారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సూచన మేరకే వాంగ్ యాంగ్ ఈ వేడుకలకు హాజరవుతున్నట్లు సమాచారం. కొన్నేళ్లుగా ఆర్థిక, రక్షణ రంగాల్లో పాకిస్థాన్ కు చైనా సహకారం అందిస్తోంది