ఆరంజ్ పండు ద్వారా మతిమరపు దూరం..

వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపును ఆరంజ్ పండుతో దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు పరిశోధకులు. 50 నుంచి 60 సంవత్సరాలు వయస్సు వచ్చిన వారు ప్రతిరోజు ఒక పుల్లని పండును ఆరంజ్, దానిమ్మ, ద్రాక్ష తినడం ద్వారా మతిమరుపును పారద్రొలవచ్చని జపాన్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో వెల్లడైయింది. ప్రతిరోజూ ఆరంజ్‌ తిన్న వారిలో మతిమరుపు లక్షణాలు కనిపించలేదని వాడు చెబుతున్నారు.  అయితే కేవలం సిట్రస్‌ లభించే పండును తినడం వలనే వీరిలో మతిమరుపు దూరం అయిందా? లేదా అన్న విషయం మీద ఇంకా పరిశోధనలు నిర్వహించాలని వారు చెబుతున్నారు.