రాముడే రావణుడైతే..!

రాముడేంటి..? రావణుడేంటి అని ఆలోచిస్తున్నారా..?  అవును మీరు చదివింది నిజమే. సాక్షాత్తే రాముడే రావణాసురుడిగా మారాడు. ఈ విషయాన్ని  బాబీ చెప్పాడు. ఏంటి ఇంకా అర్థం కాలేదా..? అదేనండీ ఇదంతా జై లవకుశ మూవీ గురించి. బాబీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేస్తున్న మూవీ జై లవకుశ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ యూనిట్ రిలీజ్ చేసింది. రాజసం, రౌద్రం కలిసింది... మీ రావణుడు ఎలా ఉన్నాడు అంటూ డైరెక్టర్ బాబీ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు. బాబీ కామెంట్స్ ను బట్టి నెగెటివ్ రోల్ చేస్తున్న ఎన్టీఆర్ లుక్ అన్నది అందరికీ అర్థమైంది. కానీ చేతికి సంకెళ్లతో నమస్కరిస్తుండగా వెనుక రావణాసురుడి పదితలలు కనిపించడం, మరో స్టిల్ లో బ్యాక్ గ్రౌండ్ లో పది తలల రావణాసురుడు కనిపిస్తుండగా కారులోం చి దిగుతున్న ఎన్టీఆర్ పోస్టర్ చాలా స్టైలిష్ గా ఉంది. అదే ఇప్పుడు సినిమాపై భారీ అంచనాలే పెంచేసింది. ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ చేస్తున్న మూవీ కావడం. అందలోనూ నెగెటివ్ షేడ్ ఉన్న రోల్ కావడంతో సినిమాపై హెవీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మొత్తానికి ఫస్ట్ లుక్ తో ఎన్టీఆర్ సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్లాడు. 

YOU MAY LIKE