కేంద్రానికి చేరని పల్నాడు వాటర్ గ్రిడ్ : లోకేష్ కు ఎం.పి.రాయపాటి ఫిర్యాదు

 అమరావతి :  మాచర్ల, వినుకొండ,గురజాల,నియోజకవర్గాలకు త్రాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన పల్నాడు వాటర్ గ్రిడ్ సమగ్ర నివేదిక  ఇంతవరకు రాష్ట్రం నుండి కేంద్రానికి చేరలేదని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావు రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ  అభివృద్ధి  శాఖా మంత్రి శ్రీ నారా లోకేష్ కు ఫిర్యాదు చేసారు. శుక్రవారం నాడు నారా లోకేష్ తో భేటీ  అయిన రాయపాటి తాను 1150 కోట్ల అంచనాతో పల్నాడు ప్రాంతం లో మాచర్ల, వినుకొండ,గురజాల,నియోజకవర్గాలకు త్రాగునీటిని అందించేలా పధకాన్ని తయారు చేసి కేంద్రానికి ప్రతిపాదన పంపామని, భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడి సైతం ఈ ప్రతిపాదన పట్ల సానుకూలం గా స్పందించారని తెలిపారు. దీని పై సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి పంపాలని కేంద్రం, రాష్ట్రాన్ని కోరిందని, ఐతే ఎనిమిది నెలలుగా పంచాయతీ రాజ్ శాఖ నుండి డి.పి.ఆర్ కేంద్రానికి చేరలేదని రాయపాటి ఫిర్యాదు చేసారు. ఇదే గాకా మాచర్ల ప్రాంతం లో 94 బోర్ వేల్స్ తక్షణం మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేసిన్చినప్పటికి,జిల్లా ఆర్.డబ్లు.ఎస్,ఎస్.ఈ. తమ వద్ద నిధులు లేవంటున్నారని తెలిపారు.19కోట్ల రూపాయలతో రెంటచింతల సమగ్ర నీటి పధకం, 11 కోట్ల రూపాయలతో జెర్రి వాగు రెండో దశ నీటి పధకాలను ట్రైబల్ సబ్ ప్లాన్ క్రింద నిధులతో చేయాలని కోరగా ముఖ్యమంత్రి మంజూరుకు ఆదేశించారని వాటిని వెంటనే చేపట్టాలని కోరారు. జిల్లా లో పంచాయతీరాజ్ శాఖా ఎస్.ఈ. పోస్ట్ ఖాళీ గా వుందని వెంటనే దానికి భర్తీ చేయాలని కోరారు. తమ స్వగ్రామమైన వుంగుటూర్ కు సైడ్ డ్రెయిన్ లకు నిధులు ఇవ్వాలని కోరారు. ఇందుకు స్పందించిన లోకేష్ అధికారుల నిర్లక్ష్యపు వైఖరిని ఇక ముందు తాను సహించేది లేదని లోకేష్ పేర్కొన్నారు.ఆయన వెంటనే తన ఓ,ఎస్.డి.రంజిత్ బాషాను పిలిచి వాటర్ గ్రిడ్ ప్రతిపాదనలతో పాటు, ఇతర ప్రాజెక్ట్ లపై వెంటనే నివేదన తనకు అందజేయాలని, బోరేవేల్స్ మంజూరు చేయమని ఆదేశించిన చేయకపోవడం పై ఆర్.డబ్లు,ఎస్  ఎస్ ఈ ని వివరణ కోరుతున్నామన్నారు.రాయపాటి స్వగ్రామమైన వుంగుతుర్ కు సైడ్ కాల్వలు కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రతిపాదన సిద్ధం చేస్తే తాను నిధులు మంజూరు చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.