వైసీపీ పై లోకేష్ ఆగ్రహం

ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కులం, మతం, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తుందని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. విజయనగరం జిల్లాలో ఆయన పర్యటించారు. లోకేష్‌కు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. యూపీఏ ప్రభుత్వం 2014లో రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీని అప్పులు ఊబిలోకి నెట్టిందని నారా లోకేష్ అన్నారు.  ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన విజయనగరం జిల్లాకు చేరుకున్నారు. లోకేశ్‌కు మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు, జిల్లాకు చెందిన శాసనసభ్యులు, ఎం.ఎల్.సి.లు, మండలస్థాయి నాయకులు ఘనస్వాగతం పలికారు. అభివృద్ధికి సహకరించాల్సిన ప్రతిపక్ష వైసీపీ అడ్డుపడుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కులం, మతం, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని ఆ పార్టీ చూస్తుందని లోకేష్ ఆరోపించారు. కొత్తవలస, శృంగారపుకోట మండలాలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 2019 కల్లా ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా తాగునీటిని అందిస్తామని స్పష్టంచేశారు. దేశంలో ఏ రాష్ట్రం లేని చేయని సీఎం చంద్రబాబు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణ మాఫీ చేశారన్నారు. పల్లెటూర్లకు సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లేనని లోకేష్ తెలిపారు.

YOU MAY LIKE