తుదితీర్పు..

హైదరాబాద్ లో సంచలనం రేపిన తొలి మానవబాంబు కేసులో నాంపల్లి కోర్టు తుది తీర్పు ఇచ్చింది.
2005 టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో మానవ బాంబు ద్వారా పేలుళ్లకు పాల్పడిన కేసులో నలుగురిని నిందితులుగా నాంపల్లి కోర్టు నిర్థారించింది. ఈ కేసులో మరో ఆరుగురిని నిర్దోషులుగా గుర్తించి కోర్టు విడుదల చేసింది. ఈ కేసులో నిందితులను భారీ బందోబస్తు నడుమ నాంపల్లి కోర్టుకి తీసుకు వచ్చారు.
2005 అక్టోబర్ 12న బేగంపేట టాస్క్ ఫోర్స్ కార్యాలయం పై హర్కతుల్ జిహాద్ ఇస్లామి అనే బంగ్లాదేశ్ సంస్ధ దాడి చేసినట్లు కోర్టు నిర్థారించింది