నజ్రియా నజిమ్ రీ ఎంట్రీ

రాజా రాణి ఫేమ్ నజ్రియా నజిమ్ తన పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనా సంగతి తెలిసిందే.

అయితే ‘నేరం’, ‘రాజారాణి’, ‘వాయైు మూడి పేసవుమ్‌’ తదితర చిత్రాలతో కోలీవుడ్‌ యూత్‌ను మెస్మరైజ్‌ చేసిన మలయాళతార నజ్రియా నజిమ్  పెళ్లి తరువాత సినిమాలకు దూరమైంది. మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మూడేళ్లపాటు కెమెరా కి దూరంగా ఉన్న నజిరియా ఇప్పుడు తన భర్త ప్రోత్సాహంతో మళ్లీ కెమెరా ముందుకు రావాలని నిర్ణయించుకుంది.

 

ఇప్పటికే కథలు కూడా వింటోందని సినీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఈ విషయం తెలిసి పలువురు దర్శకులు ఆమెను తమ చిత్రాల్లో నటించమని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ‘బెంగళూరు డేస్‌’ దర్శకురాలు అంజలి మేనన్‌ చెప్పిన కథ నచ్చడంతో, ఆ సినిమాకు నజిరియా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. కాగా, మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్న నజ్రియా అందుకు తగ్గట్టుగా తన బరువు తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉందట.

 

YOU MAY LIKE