రక్తసిక్తమైన ... క్వెట్టా నగరం

పాకిస్థాన్ లోని క్వెట్టా నగరం మరోసారి రక్తసిక్తమైంది. క్వెట్టాలో శక్తివంతమైన బాంబుపేలుడు ధాటికి 15 మంది మరణించారు. ఈ ఘటనలో మరో 20 మంది గాయపడినట్లు సమాచారం. మోటర్ సైకిల్ పై వచ్చిన వ్యక్తి ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్వెట్టా లోని అత్యంత భద్రత ఉన్న ప్రాంతానికి సమీపంలో ఓ బస్టాప్ వద్ద పేలుడు జరిగింది. ఆర్మీ అధికారుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లుగా అధికారులు గుర్తించారు. పాక్ స్వాతంత్ర్య వేడుకలకు విఘాతం కలిగించేందుకే ఈ దాడి చేసినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు