అకస్మిక తనిఖీలు ... !

పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు గుంటూరులోని పలు చౌకదుకాణాల్లో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. వినియోగదారులకు అందిస్తున్న బియ్యం నాణ్యత, తూకాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలు చోట్ల రికార్డులను పరిశీలించి  .. ధరల పట్టికను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నగరంలో పలు సినిమా థియేటర్లు, మాల్స్ లో ఆహార ప్రమాణాల నాణ్యత, ధరలను అడిగి తెలుసుకున్నారు. అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్నారని తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశించిన ధర కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.