కౌలాలంపూర్ లో ఘోర అగ్నిప్రమాదం..

మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ మతానికి చెందిన పాఠశాలలో ఈ రోజు జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 25 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. ఈ రోజు తెల్లవారుజామున నగరంలోని జలాన్ దాతుక్ కెర్మాట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, మృతుల్లో ఎక్కువ మంది 5 నుంచి 18 ఏళ్ల లోపు వారు ఉన్నట్టు సమాచారం. కాగా, ఇప్పటివరకు 23 మంది మృతి చెందినట్టు మలేషియా ప్రభుత్వం ప్రకటించింది. అయితే, మృతుల సంఖ్య 25 వరకు ఉండవచ్చని అనధికారిక వర్గాల సమాచారం. ఈ ప్రమాద ఘటనపై మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ సంతాపం వ్యక్తం చేశారు. 

 

YOU MAY LIKE