డిప్రెషన్‍కు కొత్త మందు?

సాధారణంగా డిప్రెషన్‍లో ఉన్నప్పుడో లేదా మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడో డ్రగ్స్ తీసుకోడమన్నది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. అనేక మంది వీటికి బానిసలుగా కూడా మారుతున్నారు. ఈ పరిస్థితిల్లో శాస్త్రవేత్తలు డిప్రెషన్ తగ్గించేందుకు కొత్త మార్గాన్ని కనుక్కుంటున్నారట. మ్యాజిక్ మష్‍రూమ్స్ అనే పుట్టగొడుగుల రకాలను ఇందుకోసం ఉపయోగించనున్నారు. 

లండన్‍కు చెందిన కంపాస్ పాత్‍వేస్ అనే ప్రా‍రంభ సంస్థ డిప్రెషన్‍లో ఉన్న 400 మంది మానసిక రోగులపైన ఈ ప్రయోగం చెయ్యనుంది. ప్రస్తుతం ఉన్న ఎలాంటి వైద్య పద్దతులకు స్పందించని వారిని ఇందుకోసం ఎంచుకున్నారు. ఈ పుట్టగొడుగులలోని సిలోసైబిన్ అనే పదార్ధాన్ని అధ్యయనం చేయనున్నారు. దీని వల్ల ప్రమాదం ఉండదని నిర్ధారణకు రావాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మూడు నెలల పాటు ఎనిమిది యూరోప్ దేశాలలో ఈ ప్రయోగం కొనసాగుతుంది. ఒకవేళ ఈ ప్రయోగం సఫలమైతే ఈ పుట్టగొడుగులను అధికారికంగా వైద్యానికి ఉపయోగిస్తారు.

YOU MAY LIKE