అవమానం భరించలేక ...

చేయని తప్పును తనపై మోపడంతో .... అవమాన భారం భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది.  మంచాల మండలం ఆగపల్లి గ్రామానికి   చెందిన లింగస్వామి వృత్తిరీత్యా లారీ డ్రైవర్. ఈ నెల 9 న  విధులు ముగించుకుని రాత్రి పది గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు. ఇదే సమయంలో లింగస్వామి ఇంటిపక్కనున్న వ్యక్తులు తమ ఇంట్లో బంగారం పొయ్యందని ..ఇందుకు లింగస్వామే కారణమంటూ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ కేసుతో లింగస్వామికి ఎలాంటి సంబంధం లేదని తెలియడంతో వదిలేశారు. అయితే  గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు బంగారం విలువ 25 వేల రూపాయలు చెల్లించాలని  డిమాండ్ చేయడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.