ఇలా చేస్తే లిప్స్ పింక్ అయిపోతాయట..

గులాబీ రంగు పెదాలు ఎంతో అందంగా ఉంటాయి. ముఖ వర్ఛస్సును పెంచుతాయి. అంతేకాదు మనం ఆరోగ్యంగా ఉన్నామన్న దానికి అవి చిహ్నం కూడా. నల్లగా ఉన్న పెదాలు గులాబీరంగులోకి రావాలంటే చాలా ఈజీ. పెదాల పై పేరుకు పోయిన మృతకణాలను మృదువుగా తొలగిస్తే చాలు. ఇందుకోసం కొన్ని సాధారణ హోమ్‌ రెమిడీస్‌ ఉన్నాయి. కుంకుమపువ్వు, ఒక టీస్పూను పాలు, ఒక టీస్పూను మీగడలని కలిపి ఆ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లబడిన తర్వాత ఆ మిశ్రమాన్ని పెదాలమీద రాసుకుని కొంతసేపు ఉంచుకోవాలి. ఆ తర్వాత దూదితో పెదాలను సున్నితంగా తుడిచేసుకోవాలి. ఒక టేబుల్‌ స్పూను పాలలో కొన్ని గులాబిరెక్కలు వేయాలి. పాలల్లో కలిసిపోయేలా గులాబిరెక్కల్ని మెత్తగా చేయాలి. ఆ మిశ్రమాన్ని చల్లగా అయే వరకూ ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లబడిన తర్వాత అందులో బాదం పొడి వేసి పేస్టులా తయారుచేయాలి. ఆ పేస్టును పెదాలపై రాసి 10-15 నిమిషాలపాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత దూదితో పెదాలను తుడిచేసుకోవాలి.

 

YOU MAY LIKE