లేపాక్షి 'ఎగ్జిబిషన్' ...

చేతివృత్తుల వారికి ప్రోత్సాహం ఇచ్చేందుకు హస్తకళల అభివృద్ధి సంస్థ కృషి చేస్తోంది. అందులో భాగంగా అనంతపురంలో లేపాక్షి ఎగ్జిబిషన్ ప్రారంభించారు. అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్ మూర్తి ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. 15 రోజుల పాటు నిర్వహించే హస్తకళల ప్రదర్శనలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ వస్తువులను ప్రదర్శించనున్నారు. నిర్మల్ పెయింటింగ్స్, కొండపల్లి బొమ్మలు, తోలు బొమ్మలు, లేస్ అల్లికలు, బంజారా ఎంబ్రాయిడరీలు, చెక్క బొమ్మలు, పోచంపల్లి, నారాయణపేట చీరలు వంటి వివిధ రకాలు వస్తువులు ప్రదర్శనలో ఉన్నాయి. హస్తకళల ప్రదర్శనను జిల్లా ప్రజలు వినియోగించు కోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. 

YOU MAY LIKE