వినాయక చవితికి రానున్న లవకుమార్

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ సినిమాతో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే జై టీజర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను భారిగా పెంచేసింది చిత్ర యూనిట్. మూడు పాత్రల్లో కనిపించబోతున్న ఎన్టీఆర్‍ పోషిస్తున్న మరోపాత్ర‌ లవ ఫస్ట్ లుక్ ను విడుదల చేసినా ఆ పాత్రకు సంబంధించి టీజర్ ను ఇంతవరకు విడుదల చేయలేదు. ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్న లవ్ కుమార్ టీజర్ ను వినాయక చవితికి విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించి‍ంది. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‍పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మొదటిసారి తారక్ త్రిపాత్రాభినయంలో కనిపించబోతున్నాడు.

YOU MAY LIKE