అనారోగ్యానికి దారిదే...

రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారా..? అయితే ఇక వెంటనే ఆ అలవాటుకు చెక్ పెట్టాలంటున్నారు న్యూయార్క్ లోని బింగ్హాంటన్ యూనివర్సిటీకి చెందిన సైకాలిజీ ప్రొఫెసర్ మెరీడిత్ కోల్స్. లేదంటే అనారోగ్యం భారిన పడతారని హెచ్చరిస్తున్నారు. దీనిపై  వెనకటికి పెద్దలు చెప్పిన సామెత కూడా లేట్ నిద్రకు సరిగ్గా సరిపోతుంది. అదే  ఆలస్యం అమృతం విషం.
అంతేకాదు మానసిక రుగ్మతకు లేటు నిద్రే కారణమని వారి అధ్యయనంలో తేలింది. అసాధారణ సమయంలో నిద్రపోవడంతో ఆ అంశం వారి మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుందన్నారు. ఈ లేటు నిద్ర  వల్ల తీవ్రమైన ఆందోళన, ఒత్తిడి అధికమవుతాయని తెలిపారు.