ప్రాణం తీసిన పరుగు..

కర్నూలు జిల్లా గూడురులో విషాదం చోటుచేసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు పరుగుపందెం పోటీలను నిర్వహించారు. ఈపోటీలల్లోపాల్గొన్న ఎనిమిదవ తరగతి విద్యార్థి పరిగెడుతూ స్పృహ తప్పి పడిపోయాడు. హుటాహుటిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు