మహాగణపతికి భారీ వీడ్కోలు

ప్రఖ్యాత ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. అధికారుల విజ్ఞప్తి మేరకు ఉదయమే ప్రారంభమైన శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. గణేష్‌ ఉత్సవ సమితి సభ్యులు ముందుగా విగ్రహాన్ని మండపం నుంచి వేరుచేసి రవి క్రేన్స్‌కు చెందిన హైడ్రాలిక్‌ టెలీస్కోప్‌ మొబైల్‌ క్రేన్‌’ ద్వారా భారీ వాహనంపైకి ఎక్కించారు. 60 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు గల భారీ వాహనంపై గణనాథుడు హుస్సేన్‌సాగర్‌కు బయలుదేరాడు. భక్తజనం అడుగడుగునా మహాగణపతికి నీరాజనం పట్టారు. భక్తజన సందోహం నడుమ‌ ట్యాంక్‌బండ్‌కు చేరుకున్న మహాగణపతికి అర్చకులు తుది పూజలు నిర్వహించారు. అనంతరం భారీ క్రేన్‌ ద్వారా గణపతిని హుస్సేన్‌సాగర్‌ జలాల్లో నిమజ్జనం చేశారు.

YOU MAY LIKE