బై బై గణేశా..

వీధివీధినా కొలువై ఘనంగా పూజలందుకున్న గణనాథుడు గంగ ఒడికి తరలనున్నాడు. జై జై గణేశా అంటూ పది రోజులుగా పార్వతీ తనయుణ్ని కొలుస్తున్న భక్తజనం  బై బై గణేశా అంటూ ఏకదంతుడిని వైభవంగా సాగనంపేందుకు సిద్ధమయ్యారు. విఘ్న వినాయకుడికి భక్తిగా వీడ్కోలు పలకనున్నారు. ఈ ఊరేగింపు సంబరాలను చూసేందుకు దాదాపుగా 12 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా పోలీసులు పటిష్ఠ బందోభస్తు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రమంతా ఆసక్తిగా తిలకించే ఖైరతాబాద్ భారీ గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని మధ్యాహ్నంలోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.

YOU MAY LIKE