విజయవాడకు కేసీఆర్..

ఈనెల 27న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ వెళుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను కనకదుర్గమ్మకు మొక్కిన మొక్కులను తీర్చుకునేందుకు కేసీఆర్ విజయవాడకు వెళ్లనున్నారని అధికారులు స్పష్టం చేశారు. ఆయన పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. దుర్గమ్మకు బంగారు ముక్కుపుడకను కానుకగా ఇస్తానని కేసీఆర్ మొక్కుకున్న సంగతి తెలిసిందే.

 

YOU MAY LIKE