స్థానిక‌త గ‌డువు పొడిగించండి..

జూన్ 2వ తేదితో స్థానిక‌త గ‌డువు ముగుస్తుందని.. దీనిని మ‌రో రెండేళ్ల పాటు పొడింగించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని మంత్రి కాల్వ‌శ్రీనివాసులు తెలిపారు. హెడ్ క్వార్ట‌ర్స్ పై కేంద్రం ఇచ్చిన ఉత్త‌ర్వులు సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉన్నాయ‌న్నారు. విభ‌జ‌న చట్టంలోని అంశాల‌పై సీఎం చంద్ర‌బాబు స‌మీక్షించారన్నారు. 9,10 షెడ్యూల్ లో ఉన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కాక‌పోవ‌డంతో మ‌రో రెండేళ్లు గ‌డువు కోరుతున్నామ‌ని చెప్పారు.  విభ‌జ‌న చట్టంలోని అన్ని అంశాలు సాధించి తీరుతామ‌ని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ర‌కాల ప్రభాక‌ర్ స్ప‌ష్టంచేశారు.

YOU MAY LIKE