ఎన్టీఆర్ రికార్డ్ ... !!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన 'జై లవ కుశ' ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి జోరుమీదుంది. ఎన్టీఆర్ మూడు క్యారెక్టర్లో అదరగొడుతుండటం చూసి అభిమానులు ఈ ట్రైలర్ కి బ్రహ్మరథం పడుతున్నారు. చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడకుండా ఉండలేకపోతున్నారు. ఆదివారం  విడుదలైన ఈ ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 7.54 మిలియన్ల వ్యూస్ రాబట్టి అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఇంత వేగంగా ఇన్ని వ్యూస్ సాధించిన రెండో ట్రైలర్ ఇదేనని మూవీ ట్రాకర్ రమేష్ బాలా ట్వీట్ చేశాడు. మొదటి స్థానంలో బాహుబలి ట్రైలర్ ఉందని చెప్పాడు. 

YOU MAY LIKE