ఒకరోజు ముందుగానే..

బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'జయ జానకి నాయక' సినిమా తెరకెక్కింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - రకుల్ జంటగా నటించిన ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అదే రోజున రానా 'నేనే రాజు నేనే మంత్రి' ..నితిన్ 'లై' సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలపై భారీగానే అంచనాలు వున్నాయి.

 

 దాంతో 'జయ జానకి నాయక' సినిమాను ఒక రోజు ముందుగానే విడుదల చేస్తే, థియేటర్ల పరంగా .. వసూళ్ల పరంగా సేఫ్ సైడ్ కి వెళతామని బయ్యర్లు పట్టుపడుతున్నారట. దాంతో దర్శక నిర్మాతలు ఈ నెల 10వ తేదీనే ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్టు సమాచారం.