‘జయ జానకి నాయక’: రివ్యూ

మాస్‌ టైటిళ్లతో అదరగొట్టే శ్రీను.. ఈసారి ‘జయ జానకి నాయక’ అనే సున్నితమైన పేరు పెట్టారు. మరి ఈ ప్రయత్నం బోయపాటికి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? బోయపాటి ఆవిష్కరించిన ఆ సరికొత్త కోణం ఏమిటి? ‘జయ జానకి నాయక’ ఏ తరహా చిత్రం?

 

కథేంటంటే: గగన్‌(బెల్లంకొండ శ్రీనివాస్‌)కు కుటుంబం అంటే చాలా ఇష్టం. నాన్న చక్రవర్తి (శరత్‌కుమార్‌) అన్నయ్య(నందు)లంటే అత‌నికి ప్రాణం. గగన్‌కు స్వీటి(రకుల్‌ప్రీత్‌సింగ్‌) పరిచయం అవుతుంది. ఆమె రాకతో చక్రవర్తి ఇంటి స్వరూపమే మారిపోతుంది. స్వీటి-గగన్‌ ప్రేమించుకుంటారు. అయితే స్వీటి జీవితంలో అనుకోని ఓ సంఘటన ఎదురవుతుంది. అప్పటి వరకూ సీతాకోకచిలుకలా ఎగిరిన ఆమె.. ఒక్కసారిగా పంజరంలో పావురం అవుతుంది. అలాంటి స్వీటిని రక్షించడానికి గగన్‌ కుటుంబం ఏం చేసింది? అశ్వింత్‌ నారాయణ (జగపతిబాబు)కీ, స్వీటికి ఉన్న సంబంధం ఏమిటి? తదితర విషయాలు తెరమీద చూడాలి.

 

ఎలా ఉందంటే: ఇదో ప్రేమ కథ. ప్రేమించిన అమ్మాయి కోసం ఓ యువకుడు ఏం చేశాడు? ఎవరిపై పోరాటం చేశాడు? అనే ఇతివృత్తంతో సాగుతుంది. ఆ కథ చుట్టూనే యాక్షన్‌ ఎమోషన్‌ సన్నివేశాలను అల్లుకున్నాడు దర్శకుడు. బోయపాటి శ్రీను ప్రధాన బలం యాక్షన్‌. అతను ఏ కథ ఎంచుకున్నా యాక్షన్‌.. మాస్‌ మసాలా బాగా దట్టిస్తాడు. ఈసారి అదే దారిలో నడిచాడు. సినిమా ప్రారంభం నుంచే ఓ ఎమోషన్‌ డ్రైవ్‌తో సాగుతుంది. యాక్షన్‌ ఘట్టాలు, వాటి ముందు వచ్చే లీడ్‌ సన్నివేశాలను దర్శకుడు బాగా రాసుకున్నాడు. దాంతో మాస్‌ ప్రేక్షకులకు ఆయా సన్నివేశాలు నచ్చుతాయి. పరువు-పంతం వీటి నడుమ ఓ అమ్మాయి ఎలా నలిగిపోయింది అనే విషయాన్ని దర్శకుడు సమర్థంగా తెరకెక్కించగలిగాడు. హంసలదీవిలో తెరకెక్కించిన యాక్షన్‌ ఎపిసోడ్‌ సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలుస్తుంది. శరత్‌కుమార్‌ ఉన్న సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులకు నచ్చుతాయి. ఇదో ప్రేమకథ అయినప్పటికీ నాయకనాయికల మధ్య రొమాన్స్‌ కంటే హీరో-విలన్ల మధ్య ఎమోషన్‌కు దర్శకుడు పెద్ద పీట వేయడం గమనార్హం. లెక్కకు మించిన యాక్షన్‌ సన్నివేశాలతో తెరపై అధిక భాగం ఫైట్లకే పరిమితం చేసినా, దాని చుట్టూ ఎమోషన్‌ సన్నివేశాలు ప్రేక్షకుడిని కదలకుండా చేస్తాయి.

YOU MAY LIKE