ఉల్లంఘన..

పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ము కశ్మీర్ సరిహద్దులోని పూంచ్ జిల్లా వాస్తవాధీన రేఖ సమీపంలో పాకిస్థాన్ బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. అప్రమత్తమైన భారత సైన్యం ఎదురు కాల్పులతో ధీటుగా జవాబిచ్చాయి. ఈ కాల్పుల్లో ఒక మహిళ మృతి చెందినట్లు సమాచారం. మరోవైపు కుప్వారా జిల్లాలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక జవానుకు గాయాలయ్యాయి