జై లవకుశ కు సెన్సార్ ఆమోదం

            బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘జై లవకుశ’. ఈ చిత్రానికి కల్యాణ్‌రామ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాశీఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుందని కల్యాణ్‌రామ్‌ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. చిత్రానికి సెన్సార్‌ బోర్డు నుంచి యు/ఎ సర్టిఫికెట్‌ లభించినట్లు ఆయన ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ను ఆయన విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్‌ రావణాసురుడిలా పది తలలతో కనిపించారు. ‘జై లవకుశ’ చిత్రాన్ని చూసి సెన్సార్‌ సభ్యులు ప్రశంసించారని మాటల రచయిత కోనా వెంకట్‌ ఫేస్‌బుక్‌ వేదికగా పేర్కొన్నారు.

ఇటీవల విడుదల చేసిన ‘జై లవకుశ’ ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ట్రైలర్‌ లో ఎన్టీఆర్‌ నటన అద్భుతంగా ఉందని పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇది విడుదలైన 24 గంటల్లో 7.4 మిలియన్ వ్యూస్‌ సాధించింది. అతి తక్కువ సమయంలో అత్యధిక వ్యూస్ సాధించిన రెండో తెలుగు సినిమా ట్రైలర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాను దసరా కానుకగా కళ్యాణ్ రామ్ సెప్టెంబరు 21న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

YOU MAY LIKE