'కుశ' టీజర్ రిలీజ్..!

ఎన్టీఆర్ .. బాబీ దర్శకత్వంలో 'జై లవ కుశ' సినిమా తెరకెక్కింది. కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతోంది. 

 

రీసెంట్ గా 'కుశ' ఫస్టులుక్ వదిలిన ఈ సినిమా టీమ్, కొంతసేపటి క్రితం 'కుశ' పాత్రకి సంబంధించిన టీజర్ ను వదిలింది. కామెడీ .. యాక్షన్ సీన్స్ పై ఈ టీజర్ కట్ చేశారు. ఈ పాత్రలో ఎన్టీఆర్ మాస్ లుక్ తో కనిపిస్తున్నాడు. జై .. లవ .. పాత్రలకి పూర్తి భిన్నంగా ఈ పాత్ర కనిపిస్తూ ఉండటం విశేషం. 'కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా వచ్చురా" అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేదిలా వుంది. 

YOU MAY LIKE