చంద్రబాబును కాలర్ పట్టుకుని అడగండి..

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై జగన్ మోహన్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను నేరవేర్చని నాయకులను కాలర్ పట్టుకుని నిలదీయాలని ఓటర్లకు సూచించారు. పేదలకు పక్కా ఇళ్లు ఇస్తామంటూ నమ్మబలికి ప్రజలను చంద్రబాబు మోసం చేశారన్నారు. మూడున్నరేళ్లలో తెలుగుదేశం నాయకులెవ్వరూ నంద్యాలను పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఎన్నికలు రాగానే ఓట్ల కోసం టీడీపీ శ్రేణులు నంద్యాల వీధుల్లో పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు

YOU MAY LIKE