సినిమాల్లోకి రావాల‌న్న కోరిక నెర‌వేరింది.- యంగ్‌ హీరో ఇషాన్‌

×

Error message

  • Notice: Undefined offset: 28 in user_node_load() (line 3694 of /home/aptimes/public_html/modules/user/user.module).
  • Notice: Trying to get property of non-object in user_node_load() (line 3694 of /home/aptimes/public_html/modules/user/user.module).
  • Notice: Undefined offset: 28 in user_node_load() (line 3695 of /home/aptimes/public_html/modules/user/user.module).
  • Notice: Trying to get property of non-object in user_node_load() (line 3695 of /home/aptimes/public_html/modules/user/user.module).
  • Notice: Undefined offset: 28 in user_node_load() (line 3696 of /home/aptimes/public_html/modules/user/user.module).
  • Notice: Trying to get property of non-object in user_node_load() (line 3696 of /home/aptimes/public_html/modules/user/user.module).

 

 

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన 'చిరుత'తో హీరోగా పరిచయమైన రామ్‌చరణ్‌ ఇప్పుడు మెగా పవర్‌ స్టార్‌గా స్టార్‌ హీరో ఇమేజ్‌ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. లేటెస్ట్‌గా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో 'రోగ్‌' చిత్రంతో తెలుగు, కన్నడ భాషల్లో ఇషాన్‌ హీరోగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే.  'రోగ్‌' చిత్రం ఉగాది కానుకగా మార్చి 31న తెలుగు, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో హీరో ఇషాన్‌తో ఇంటర్వ్యూ.. 

ప్ర‌శ్న‌:'రోగ్‌'తో తెలుగు, కన్నడ భాషల్లో హీరోగా పరిచయమవుతున్నారు. ఎలా అనిపిసప్తోంది? 

జ‌వాబు:  చాలా ఎక్సైటింగ్‌గా వుంది. సేమ్‌ టైమ్‌ నెర్వస్‌గా కూడా వుంది. 'రోగ్‌' సినిమాతో నా కెరీర్‌ స్టార్ట్‌ అవుతోంది. నా డ్రీమ్‌ నిజం కాబోతోంది. 

ప్ర‌శ్న‌: హీరో అవ్వాలని ముందు నుంచే అనుకున్నారా? 

- జ‌వాబు: నేను హీరో అవ్వాలి అనుకున్న తర్వాత ఆ విషయాన్ని అన్నయ్యకి చెప్పాను. అన్నయ్య ఆల్‌రెడీ ప్రొడక్షన్‌లో వున్నారు కాబట్టి నేను చెప్పింది విన్న తర్వాత ఒకే మాట చెప్పారు. నువ్వు టాల్‌గా వున్నావు, లుక్స్‌ బాగున్నాయి. ఓకే. హీరో అవ్వడానికి ఈ క్వాలిఫికేషన్స్‌ ఒక్కటే చాలవు. యాక్టింగ్‌ నేర్చుకోవాలి, హార్డ్‌ వర్క్‌ చెయ్యాలి, డాన్స్‌, ఫైట్స్‌.. ఇలా అన్నీ నేర్చుకోవాలి అని చెప్పారు. తర్వాత ప్రొడక్షన్‌లో నాతో వర్క్‌ చేయించారు. సంవత్సరంన్నర మా ఓన్‌ బేనర్‌లో చేసిన సినిమాలకు ప్రొడక్షన్‌లో వర్క్‌ చేశాను. అలా నా జర్నీ స్టార్ట్‌ అయింది. రెండు సినిమాలకు పనిచేసిన తర్వాత సత్యానంద్‌గారి దగ్గర కోచింగ్‌ తీసుకోవడానికి వైజాగ్‌ పంపించారు. సత్యానంద్‌గారు నన్ను బాగా ట్రైన్‌ చేశారు. అది పూర్తి కాగానే పూరి సర్‌తో మీటింగ్‌ ఎరేంజ్‌ చేశాను హైదరాబాద్‌ వచ్చెయ్యమని అన్నయ్య చెప్పారు. 

ప్ర‌శ్న‌: ఫస్ట్‌ మూవీ పూరి జగన్నాథ్‌గారి డైరెక్షన్‌లో చెయ్యబోతున్నానని తెలిసిన తర్వాత మీరెలా ఫీల్‌ అయ్యారు? 

జ‌వాబు: అది నాకు షాకింగ్‌గానూ, సర్‌ప్రైజింగ్‌గానూ అనిపించింది. నా యాక్టింగ్‌ కోర్స్‌ కంప్లీట్‌ అవ్వగానే నా డ్రీమ్‌ డైరెక్టర్‌ పూరి సర్‌ డైరెక్షన్‌లో సినిమా చెయ్యబోతున్నానని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. నేను పూరిగారికి పెద్ద ఫ్యాన్‌ని. అలాంటిది ఆయన డైరెక్షన్‌లో నన్ను హీరోగా ఇంట్రడ్యూస్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది.