ప్రచార హోరు ... !!

ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ... ఇంటింటికి టీడీపీ చేపట్టినట్టు అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలియజేశారు. ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. స్ధానికులను అడిగి గ్రామంలోని  సమస్యలు తెలుసుకున్నారు. తూర్పు కంబంపాడు గ్రామంలో అంగన్ వాడీ కేంద్రంలో తగిన వసతులు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ధానికుల సమక్షంలోనే పీడీకి ఫోన్ చేసి వివరణ కోరారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులను అవసరానికి అనుగుణంగా ఖర్చు చేయాలంటూ సూచించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.   

YOU MAY LIKE