తడబడి..

 భారత్‌-శ్రీలంకల మధ్య జరుగుతున్న చివరి టెస్టులో భారత ఆటగాళ్లు తడబడుతున్నారు. తొలి సెషన్‌లో పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచిన టీమిండియా రెండో సెషన్‌లో దాన్ని చేజార్చుకుంటోంది. స్వల్ప వ్యవధిలోనే ధావన్‌, పుజారా లాంటి ఇద్దరు కీలక ఆటగాళ్ల వికెట్లు కోల్పోయింది. శతకం సాధించి జోరుమీదున్న ధావన్‌ను పుష్పకుమారా పెవిలియన్‌కు పంపించాడు. 48వ ఓవర్లో పుష్పకుమారా వేసిన తొలి బంతిని ఎదుర్కొన్న ధావన్‌(119) చండీమాల్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అతని స్థానంలో సారథి కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నాన్ని పుజారా తీసుకున్నాడు. ఈ జోడీని 51వ ఓవర్లో సందకన్‌ విడదీశాడు. సందకన్‌ వేసిన బంతిని ఎదుర్కొన్న పుజారా(8) స్లిప్‌లో ఉన్న మాథ్యూస్‌కి క్యాచ్‌ ఇచ్చాడు. పుజారా స్థానంలో రహానె బ్యాటింగ్‌కి దిగాడు.

53 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది.