మూడో టెస్టులో తడబడిన టీమిండియా..

శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తడబడింది. ఓపెనర్స్ ఇచ్చిన బలమైన పునాదిని ఉపయోగించుకోవడంలో మిడిల్ ఆర్డర్ విఫలమైంది. ఫలితంగా మొదటి రోజు 6 వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఓపెనర్లు శిఖర్ ధావన్, KL రాహుల్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. మొదటి వికెట్ కు 188 పరుగుల భాగస్వామ్యం ఇచ్చారు. 85 పరుగులు చేసిన రాహుల్.. పుష్పకుమార బౌలింగ్ లో ఔట్ కావడంతో ఓపెనింగ్ భాగస్వామానికి తెర పడింది. మరోవైపు శిఖర్ ధావన్ సెంచరీ చేశాడు. 219 పరుగుల వద్ద రెండో వికెట్ గా శిఖర్ ఔటయ్యాడు. పుజారా కూడా వెంటనే ఔట్ కావడంతో స్కోర్ నెమ్మదించింది. 42 పరుగులు చేసిన కోహ్లీ, రహానే, అశ్విన్ వెంట వెంటనే ఔట్ కావడంతో స్కోర్ బోర్డు నెమ్మదించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నారు. 

YOU MAY LIKE