భాగస్వామిని వదలరు

       ఆస్తుల వ్యవహారంలో సుప్రీమ్ కోర్ట్ సరికొత్త నిర్ణయాలతో భయపడుతున్న నేతలకు కోర్ట్ మరో షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు తమ జీవిత భాగస్వామి ఆస్తుల వివరాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) సుప్రీంకోర్టుకు వివరించింది. ఎన్నికల్లో నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఆయా అభ్యర్థులు తమ జీవిత భాగస్వామి ఆస్తులు వెల్లడించాల్సి ఉంటుందని తెలిపింది. దీనికి ఎన్నికల సంఘం కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు పేర్కొంది. అయితే ఇప్పటివరకు 105 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల ఆస్తులు గణనీయంగా పెరిగినట్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజకీయ నేతల ఆస్తులపై సీబీడీటీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

YOU MAY LIKE